తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. హుజురాబాద్‌కు మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని హరీష్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
