పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అంగీకరించింది. బెంగాల్‌లో మమతాబెనర్జి బరిలో దిగాలని భావిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
అదేవిధంగా బెంగాల్లోని షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ ఉపఎన్నికల్లో పోలైన ఓట్లను అక్టోబర్ 3న లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ బెంగాల్‌కు చెందిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత జూలైలో ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో బై ఎలక్షన్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.