సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జంటగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందా..అవుననే మాట ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన గ్లామర్ డాల్ నభా నటేశ్. పూరి జగన్నాథ్ రూపొందించిన ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్‌కు జంటగా నటించి మాస్ డైలాగ్‌లతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. త్వరలో నితిన్‌కు జంటగా నటించిన ‘మ్యాస్ట్రో’ మూవీతో అలరించేందుకు సిద్ధమవుతోంది.
కాగా, నభాకి తాజాగా తెలుగులో ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లు సమాచారం. మహేశ్‌బాబు హీరోగా, మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే పూజా హెగ్డేను ప్రకటించారు. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా నభా నటేశ్‌కు అవకాశం దక్కిందని తెలుస్తోంది. త్వరలో దీనిపై చిత్ర బృందం నుంచి అనౌన్స్‌మెంట్ రానుందట. ఈ సినిమాను హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.