క్యాన్సర్ రోగుల కోసం ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్ హాస్పిస్’ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. ఇంతకాలం రోటరీ క్లబ్ బంజారాహిల్స్ సారథ్యంలో అక్కడి రోడ్ నం.12లోని అద్దెభవనంలో సేవలు అందించింది. ప్రస్తుతం దానిని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు.
దీనిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని నిర్మించారు. ఈ స్థలాన్ని 33 ఏండ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. మృత్యు ముంగిట్లో ఉన్న వేలాది మంది క్యాన్సర్ రోగులకు స్పర్శ్ హాస్పిస్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.
అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారులకోసం ప్రత్యేకంగా 10 పడకలు ఏర్పాటు చేశారు. ఈ దవాఖానకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్దసంఖ్యలో రోగులు వస్తున్నారు.