Home / SLIDER / తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గులాబీ జెండా పండుగ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గులాబీ జెండా పండుగ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా నేతలు టీఆర్‌ఎస్‌ జెండాలను ఎగుర వేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొని, టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. 4వ, 23, 24వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.

నల్లగొండలో గుత్తా..

TRS Flag Festival | అట్టహాసంగా గులాబీ జెండా పండుగ.. సిద్దిపేటలో పాల్గొన్న మంత్రి హరీశ్‌
నల్లగొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో మాజీ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 48వ వార్డులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ రాష్ట్రంలోని యావత్‌ పార్టీ శ్రేణులకు, నాయకులకు జెండా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన జరుపుకోవడం శుభపరిణామమన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నడిపిస్తున్న కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్ఠతకు సంస్థాగత నిర్మాణం ఎంతో దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్‌, వార్డ్ కౌన్సిలర్ యామ కవితదయాకర్, సీనియర్ నాయకులు బోయినపల్లి కృష్ణా రెడ్డి, యామ దయాకర్, పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, తూముల రవీందర్ రావు, అనిస్ బాయ్, మనోహర్, హరికృష్ణ, రఘుపతి, కొండూరి సత్యనారాయణ, మధుసూదన రెడ్డి, ఆలయ చైర్మన్ వేణుగోపాల్, వేదాంతం శ్రీనివాస్ చార్యులు,రమేశ్‌ పాల్గొన్నారు.

చొప్పదండిలో సుంకె రవి శంకర్‌..

TRS Flag Festival | అట్టహాసంగా గులాబీ జెండా పండుగ.. సిద్దిపేటలో పాల్గొన్న మంత్రి హరీశ్‌

కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ టీఆర్‌ఎస్‌ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో తిరుగులేని రాజకీయశక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపు మేరకు జెండా పండుగ చొప్పదండిలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

రాజన్న సిరిసిల్లలో..

TRS Flag Festival | అట్టహాసంగా గులాబీ జెండా పండుగ.. సిద్దిపేటలో పాల్గొన్న మంత్రి హరీశ్‌

జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు జెండా పండుగను నిర్వహించాయి. వాడవాడనా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగుర వేసి సంబురాలు జరుపుకున్నారు. తంగళ్లపల్లి మండలంలోని 30 గ్రామాల్లోనూ నేతలు జెండాను ఎగుర వేశారు. వేములవాడ మండలం ఆరేపల్లిలో కార్యకర్తలు జెండాను ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వేడుకలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య, నేతలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ నేతలు పార్టీ జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కళ తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాలలో..

TRS Flag Festival | అట్టహాసంగా గులాబీ జెండా పండుగ.. సిద్దిపేటలో పాల్గొన్న మంత్రి హరీశ్‌

జగిత్యాల జిల్లాలో పార్టీ శ్రేణులు జెండా పండుగ అట్టహాసంగా నిర్వహించాయి. సారంగపూర్‌లో జెండా వేడుకల్లో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాయికల్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ మోర హనుమండ్లు పాల్గొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న శ్రేణులు జెండాను ఎగుర వేశారు.

మహబూబాబాద్ లో..

TRS Flag Festival | అట్టహాసంగా గులాబీ జెండా పండుగ.. సిద్దిపేటలో పాల్గొన్న మంత్రి హరీశ్‌

మహబూబాబాద్ : మహబూబాబాద్ వ్యాప్తంగా జెండా పండుగ జరిగింది. గ్రామాలు, పట్టణాల్లో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని జెండాను ఎగుర వేశారు. పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా పండుగ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లిలో జరిగిన కార్యక్రమంలో డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ పాల్గొన్నారు.

గద్వాల : గద్వాల జిల్లాలోనూ సంబురాలు కొనసాగాయి. గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగ మండల కేంద్రాల్లో నేతలు జెండాలను ఎగుర వేశారు. మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని జెండా ఎగుర వేశారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని గొర్రెల మంద వద్ద గొర్రెలకాపరులు జెండా ఎగుర వేసి సంబురాలు జరిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat