ప్రముఖ టీవీ, సినిమా నటుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో ఇవాళ మృతిచెందారు. ఆయన వయసు 40 ఏళ్లు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్ధ శుక్లా.. షోబిజ్‌తో పాపులర్ అయ్యారు. హింప్టీ శర్మా కే దుల్హనియా చిత్రంలో ఆయన నటించారు.
ఇవాళ ఉదయం శుక్లాకు భారీ గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. సిద్ధార్థ శుక్లా మరణించినట్లు కూపర్ హాస్పిటల్ ద్రువీకరించింది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే 3 లాంటి షోల్లో కనిపించాడు.
బాలికా వధు, దిల్ సే దిల్ తక్ టీవీ సీరియళ్లలో నటించారు. జలక్ దిక్లాజా 6, ఫియర్ ఫ్యాక్టర్-ఖత్నోంకా ఖిలాడి లాంటి రియాల్టీ షోల్లోనూ నటించారు.