దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరిగాయి. నిన్న 41వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. తాజాగా 47వేలకుపైగా రికార్డయ్యాయి.
గడిచిన 24గంటల్లో 47,092 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 35,181 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 509 మంది మృత్యువాతపడ్డారు.
కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. 3,20,28,825 మంది కోలుకున్నారు. ఇప్పటి వైరస్ బారినపడి 4,39,529 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 3,89,583 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్లో భాగంగా 66,30,37,334 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.