పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడేళ్ల పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉండడంతో అభిమానులు పవన్‌ని వెండితెరపై చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రీసెంట్‌గా వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు మూవీపై భారీ అంచనాలు పెంచాయి.
మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్ర లో నటిస్తున్నారు. రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రం కి సంబంధించి విడుదలైన మేకింగ్ వీడియో మరియు ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం యొక్క ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.