అందాల బ్యూటీ హాసన్ కొన్నేళ్ల క్రితం మైఖెల్ కోర్సలేతో ప్రేమయాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాలకు కూడా దూరంగా ఉంది. అతనికి బ్రేకప్ చెప్పాక తిరిగి సినిమాలు మొదలు పెట్టింది.ఇక ప్రస్తుతం ఢీల్లీ బేస్డ్ డూడల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు అర్ధమవుతుంది. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్న నేపథ్యంలో ఇద్దరి రిలేషన్‌పై అనుమానాలు నెలకొన్నాయి.
చాటు మాటు వ్యవహారంపై తాజాగా శృతి స్పందించింది. శంతన్ మంచి స్నేహితుడు. ఇద్దరు అభిరుచులు ఒకటే. కళలు, సంగీతం పట్ల అవగాహన ఉంది. అందుకే అతనితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాను. అన్ని అంశాలలోను నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకొచ్చింది శృతి. ఇక పెళ్లి విషయంపై స్పందించిన శృతి హాసన్ ..నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే .. పెళ్లికి ముందే ఆ విషయం మీడియాకి లీక్ చేస్తా అని పేర్కొంది.
సలార్
లో శృతిహాసన్ పాత్ర ఎంతో వైవిధ్యంతో అలరిస్తుందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.