దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 45 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి. నిన్నటికంటే ఇది 4.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 380 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 4,38,210కు చేరాయి.
మరో 3,19,23,405 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా, 3,76,324 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 34,763 మంది కరోనా నుంచి బయటపడ్డారని తెలిపింది. ఇప్పటివరకు 63.43 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.