లార్డ్స్ టెస్టు పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు గట్టిగానే బదులు తీర్చుకుంది. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో ఐదు సెషన్‌లుండగానే గెలుపు రుచి చూసిన ఇంగ్లండ్.. ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-1తో నిలిచింది.
నాలుగో టెస్టు వచ్చే నెల 2 నుంచి ఓవల్ మైదానంలో జరుగుతుంది. పేసర్లు ఒలీ రాబిన్సన్ (5/65), ఒవర్టన్ (3/47) భారత్ పతనాన్ని శాసించారు. దీంతో శనివారం నాలుగో రోజు మరో 63 పరుగులు మాత్రమే జత చేసిన భారత్ 99.3 ఓవర్లలో 278 రన్స్ వద్ద కుప్పకూలింది.
విరాట్ కోహ్లీ (55) అర్ధసెంచరీ చేయగా.. పుజార 91 పరుగుల వద్దే వెనుదిరిగాడు. జడేజా (30) మాత్రం చివర్లో వేగం చూపాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78.. ఇంగ్లండ్ 432 పరుగులు చేశాయి. మొత్తం ఏడు వికెట్లతో రాబిన్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 78 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 432 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) రాబిన్సన్ 59; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) ఒవర్టన్ 8; పుజార (ఎల్బీ) రాబిన్సన్ 91; కోహ్లీ (సి) రూట్ (బి) రాబిన్సన్ 55; రహానె (సి) బట్లర్ (బి) అండర్సన్ 10; పంత్ (సి) ఒవర్టన్ (బి) రాబిన్సన్ 1; జడేజా (సి) బట్లర్ (బి) ఒవర్టన్ 30; షమి (బి) మొయిన్ అలీ 6; ఇషాంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 2; బుమ్రా (నాటౌట్) 1; సిరాజ్ (సి) బెయిర్‌స్టో (బి) ఒవర్టన్ 0; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 99.3 ఓవర్లలో 278 ఆలౌట్. వికెట్ల పతనం: 1-34, 2-116, 3-215, 4-237, 5-239, 6-239, 7-254, 8-257, 9-278, 10-278. బౌలింగ్: జేమ్స్ అండర్సన్ 26-11-63-1; ఒలీ రాబిన్సన్ 26-6-65-5; క్రెగ్ ఒవర్టన్ 18.3-6-47-3; సామ్ కర్రాన్ 9-1-40-0; మొయిన్ అలీ 14-1-40-1; జో రూట్ 6-1-15-0.