పోర్చుగీసు సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు తిరిగి వెళ్లాడు. ఇప్పటి దాకా యువెంటస్ తరఫున ఆడిన రొనాల్డోకు ఇకనుంచి ఏడాదికి రూ. 253 కోట్లు (వారానికి రూ. 4.85 కోట్లు) చెల్లించేలా మాంచెస్టర్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో రొనాల్డో మాంచెస్టర్ తరఫున అత్యధిక పారితోషికం అందుకోనున్న ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ క్లబ్ తరఫున అత్యధికంగా డేవిడ్ డి గియా ఏడాదికి రూ. 197 కోట్లు తీసుకున్నాడు.