ఏం నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగున్నారా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సర్పంచును ఆప్యాయంగా పలుకరించారు.కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి కేసీఆర్ భవన్‌లో గురువారం రాత్రి బసచేసిన సీఎంను శుక్రవారం ఉదయం పలువురు మంత్రులు, అధికారులు కలిశారు.
ఇదేసమయంలో మొగ్దుంపూర్ సర్పంచు జక్కం నర్సయ్య కలిసేందుకు రాగా.. సీఎం ఆయన చేతులు పట్టుకుని ఆప్యాయంగా పలుకరించారు. నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగున్నారా.. అంటూ కుటుంబసభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి కలువు అని ఆహ్వానించారు.