తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల అంటే ఉరిశాల అనే నానుడితో వ్యవహరించిన దుర్భర స్థితి మనందరికీ తెలిసిందే. నాడు నేతన్నల ఆకలి చావులతో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన సిరిసిల్ల నేడు సిరిశాలగా మారి కోటి బతుకమ్మ చీరెలతో తెలంగాణ ఆడబిడ్డల ముఖాలలో సంబురాన్ని చూసుకొని మురుస్తోంది.
చేతినిండా ముద్దతో కడుపు నింపుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ కాలంలోనే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయినవి. ఈ నేపథ్యములో క్షేత్రస్థాయిలో పర్యటించి ‘జనంసాక్షి’ నేతన్నల అభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేసింది.
సిరిసిల్ల నేతన్నల అభిప్రాయాలతో రూపొందించిన డాక్యుమెంటరీని ఈరోజు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, పరిశ్రమలు, సమాచార సాంకేతిక(ఐటీ) శాఖమంత్రివర్యులు కేటీఆర్ ఆవిష్కరించారు.