బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది.
దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తునప్పుడు ప్రియాంకకు ఈ గాయాలు అయినట్టు తెలుస్తోంది.
ఐ బ్రోపై గాయం లోతుగానే తగిలిందని తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్‌లో అర్థమవుతోంది. ఇక ప్రియాంక చోప్రా త్వరలో ‘సిటాడెల్’ మూవీతో రాబోతుండగా, దీనితో పాటు టామ్ క్రూయిస్ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’, బాలీవుడ్లో కత్రినా కైఫ్, అలియా భట్ లతో కలిసి ‘జీ లే జారా’ చిత్రాలలో నటిస్తోంది.