మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఇటీవలే టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘లూసీఫర్’ మూవీకి అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతోంది.
ఒరిజినల్ వెర్షన్‌లో మంజు వారియర్ పోషించిన పాత్ర ఇక్కడ అనసూయకి దక్కిందని నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌ను ప్రారంభించారు.
సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ కూడా ‘గాడ్ ఫాదర్’లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు అనసూయ నటించబోతోందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే మెకర్స్ నుంచి ఇంకా ఈ విషయంలో క్లారిటీ రాలేదు.