దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 16 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు.
బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో దళితబంధు ఇంటింటి సర్వేపై స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడంలో దళితబం ధు పథకం దోహదపడుతుందని చెప్పారు. ఇది పేదదళిత జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమమని, సర్వేను అధికారులు ఇష్టంతో చేయాలని కోరారు. దళితుల ఇంటికి వెళ్లి ఓపికతో, ప్రేమతో వివరాలు సేకరించాలని సూచించారు.