Home / SLIDER / తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు మార్గదర్శకాలివే..

తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు మార్గదర్శకాలివే..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రెండు జీవోలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ విడుదలచేశారు.

ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్ల కోసం జీవో-244 జారీచేశారు. సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనలు-1996కు సవరణ చేస్తూ జీవో-243 విడుదలచేశారు.

నియామకాల్లో రోస్టర్‌ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారుచేసింది. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు పొందేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించనివారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

మార్గదర్శకాలివే..

  • ఈడబ్ల్యూఎస్‌ లబ్ధిదారుల కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. కుటుంబ పెద్ద వేతనం, వ్యవసాయం, వ్యాపారం, వృత్తుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొంటారు.
  • ఈ కోటా ద్వారా లబ్ధిపొందేందుకు తాసిల్దార్‌ జారీచేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని
  • సమర్పించాలి.
  • ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఉద్యోగాలు పొందినవారి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తారు. సర్టిఫికేట్‌ ఫేక్‌ అని తేలితే ఉద్యోగం నుంచి తొలగించి ఐపీసీ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
  • ఉద్యోగ నియమాల్లో ఒక సంవత్సరంలో అర్హులైన అభ్యర్థులు దొరక్క ఈడబ్యూఎస్‌ కోటా ఉద్యోగాలు భర్తీకాకపోతే ఆయా పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించి తదుపరి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్‌ చేయరాదు.
  • ఈడబ్యూఎస్‌ కోటా అభ్యర్థి ఆన్‌రిజర్వ్‌డ్‌ కోటా ఉద్యోగాలకు అనర్హుడు.
  • ఈడబ్యూస్‌లోకి 10 శాతం రిజర్వేషన్లలో మహిళలకు 33శాతం కోటాను అమలుచేస్తారు.
  • ఈడబ్యూఎస్‌వారికి ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిలో ఐదేండ్ల సడలింపు వర్తిస్తుంది.
  • డైరెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీల తరహాలోనే పరీక్ష రుసుముల్లో మినహాయింపునిస్తారు.
  • ఈ కోటాకు అనుగుణంగా విద్యాసంస్థలో సీట్ల సంఖ్యను పెంచుతారు.
  • రోస్టర్‌ ప్రకారం ప్రతి 100 ఉద్యోగాల్లో 9వ, 28వ, 36వ, 57వ, 76వ, 86వ, 100వ పోస్టును ఈడబ్ల్యూఎస్‌ జనరల్‌ కోటాకు, 17వ, 50వ, 65వ పోస్టును ఈడబ్ల్యూఎస్‌ మహిళలతో కేటాయించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat