ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆఫ్ఘన్ గతవారం తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. రక్షణ కరువడంతో ఆఫ్ఘన్ పౌరులతోపాటు, వివిధ కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసబాటపట్టారు.
ఈ నేపథ్యంలో మంగళవారం మరో 78 మంది భారత్‌కు వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా మొత్తం 78 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇప్పటివరకు 626 మంది భారత్‌కు వచ్చారని కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్ పూరి తెలిపారు. అందులో 228 మంది భారతీయులు ఉన్నారని, మరో 77 మంది ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సిక్కులు ఉన్నారని వెల్లడించారు. మిగిలినివారిలో విదేశీయులతోపాటు భారత ఎంబసీకి చెందినవారు ఉన్నారని చెప్పారు.