వ్యాక్సినేషన్ బుకింగ్ ( Vaccine Booking )పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పౌరుల సౌలభ్యం కోసం మొబైల్ ఫోన్లలో ఉండే వాట్సాప్ ద్వారానే టీకా స్టాట్‌లు బుక్ చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఓ ట్వీట్ చేశారు.
ఈ విధానం వల్ల టీకా రిజిస్ట్రేషన్ మరింత సులువుగా మారనున్నది. వాట్సాప్ ద్వారా టీకా బుక్ చేసుకునే పద్ధతి .. పౌరల సేవలో కొత్త యుగానికి తెరలేపిందని మంత్రి తెలిపారు. మీ ఫోన్లలోనే చాలా సులువైన రీతిలో కోవిడ్ టీకా బుకింగ్ చేసుకోవచ్చు అన్నారు.
కేవలం నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. వాట్సాప్‌లోని మైగవర్నమెంట్ఇండియా కరోనా హెల్ప్‌డెస్క్‌కు బుక్ స్టాట్ అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. దాంతో వ్యాక్సిన్ స్టాట్ రిజిస్ట్రేషన్ ఈజీగా ఉంటుందని మంత్రి మన్సూక్ తెలిపారు.