స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై రోజా భర్త, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే సంవత్సరం ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో తెలుగు తెరకి పరిచయమైంది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు.
అదే సమయంలో బాలీవుడ్‌లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్‌తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకుంది. మళ్ళీ టాలీవుడ్‌లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో అవకాశం అందుకొంది. ఈ సినిమా కూడా చెప్పుకోదగిన సక్సెస్ సాధించలేదు. అయినా పూజా అవకాశాలు దక్కించుకొని ‘మహర్షి’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది.
ప్రస్తుతం ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అందుకే ఇప్పుడు ఆమె లొకేషన్‌కు వచ్చేటప్పుడు 12 మందిని వెంటబెట్టుకొని వస్తుందట. అనవసరంగా ఇంతమంది అసిస్టెంట్స్‌ని వెంటబెట్టుకురావడం వల్ల నిర్మాతలపై బాగా ఆర్థిక భారం పడుతోందంటూ ఆర్‌కే సెల్వమణి వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూజా హెగ్డే ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఆమె ప్రస్తుతం హిందీలో సల్మాన్ సరసన ‘కబీ ఈద్ కబీ దివాలీ’, రణ్‌వీర్‌తో ‘సర్కస్’ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’లో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’, యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలు చేస్తోంది.