మూడు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శ్రీనగర్ వెళుతున్న ప్రయాణికుడి బ్యాగులో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఓ బుల్లెట్‌ను గుర్తించారు. దీంతో విచారణ నిమిత్తం బుల్లెట్‌ను, సదరు ప్రయాణికుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
ప్రయాణికుడు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత తనయుడు పరిటాల సిద్ధార్థ్. ఇతడి బ్యాగులోనే బుల్లెట్ లభించింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు 41 సీఆర్పీసీ కింద సిద్ధార్థ్ కు నోటీసులు అందజేశారు.
లైసెన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరారు. దీంతో సిద్ధార్థ్ శనివారం శంషాబాద్ ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యారు.