ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం భద్రంగా ఉందని నడ్డా పేర్కొన్నారు.
అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హయాంలో ఇప్పటివరకూ రూ 1.35 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు.డెహ్రాడూన్, రైవాలలో మాజీ సైనికులతో నడ్డా ముచ్చటించారు.
వాజ్‌పేయి హయాంలో పర్వత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. సైనికుల త్యాగ నిరతి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సైనికులు బీజేపీకి బాసటగా నిలవాలని కోరిన నడ్డా వారి నుంచి విలువైన సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.