కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులందరూ తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తారాసింగ్, కాలనీ వాసులు జివి శ్రీనివాస్, వనం సాంభ రాజు, సీహెచ్ ప్రసాద్, బస్వరాజ్ పటేల్, బి.వెంకటేష్, వై.బాల్ రెడ్డి, ఆది నారాయణ, దామోదర్, తాడెం రాజు, ఎండి మొహ్మద్, విజయ్, కే.బైరవమూర్తి, శివా నాయక్, రవీందర్ నాయక్, పిల్లి ప్రసాద్, తౌర్య నాయక్ పాల్గొన్నారు.