ఇప్పటికీ థియేటర్స్ అన్నీ తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటీవల తాను నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించాడు. దీంతో టక్ జగదీష్ మూవీ రిలీజ్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ఇక నితిన్ నటిస్తున్న మాస్ట్రో మూవీ కూడా ఓటీటీలో వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం అయింది. ‘మాస్ట్రో’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మాస్ట్రో చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలానే ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. నితిన్, నభా, తమన్నాలతో కూడిన పోస్టర్ విడుదల చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు మేకర్స్. ఈ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందింది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.