టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినీ పరిశ్రమను పైరసీ బెడదతో పాటు లీకేజ్ సమస్య ఎంతగానో వేధిస్తున్నాయి.వ ఇటీవల పుష్ప ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. అంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీక్ అయ్యింది. దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా ద్వారా లీకు రాయుళ్లను హెచ్చరించిన కొద్ది సేపటికి “పుష్ప”లో దాదాపు 20 సెకన్ల ఫైటింగ్ సీక్వెన్స్ ను లీక్ చేసి షాకిచ్చారు. ఈ లీకుల పర్వంపై టాలీవుడ్ పెద్దలు సీరియస్‌గా ఉన్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా పోస్టర్ లీక్ అయిందంటూ ప్రచారం జరుగుతుంది.