Home / SLIDER / టీపీసీసీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్

టీపీసీసీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్

టీపీసీసీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ పెద్ద తెలంగాణ ద్రోహి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం నాడు జరిగిన  ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వము లక్షా 26వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మహిళా రుణాలకు రూ.200 కోట్ల వడ్డీ చెల్లించామని చెప్పారు. 

కేసీఆరే కారణం..!

‘ రేవంత్ నీకు టీపీసీసీ ఉద్యోగం రావడానికి సీఎం కేసీఆర్ కారణం. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు 200 కిలోమీటర్ల లోతులో పాతరపెట్టారు.. ఇక ఎక్కడి నుంచి సోనియా రాజ్యం వస్తుంది..? 2009లో కొడంగల్‎లో నువ్వెట్లా గెలిచావ్ రేవంత్.. పొత్తు వల్ల కాదా..?. కేసీఆర్, కేటీఆర్ ఆదేశిస్తే.. రేవంత్‎ను 300కిలో మీటర్ల లోతుకు తొక్కుతాం. ఆకునూరి మురళి ఎక్కడ ఎవరికి అడ్వైసర్‌గా ఉన్నారో రేవంత్ చెప్పాలి’ అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే ఈ విమర్శల పట్ల కాంగ్రెస్ నేతలు.. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat