కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సమస్యలపై దృష్టి సారించారు. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది సీఎంలు వచ్చారు. కానీ రైతుల సమస్యలను పట్టించుకోలేదు. కేసీఆర్ సాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అనేకం చూశాం. నీళ్లు లేక, పంటలు పండక, పండిన కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటన్నింటినీ చూసిన కేసీఆర్.. రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణను సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నారు.
కోటి ఎకరాల మాగాణి కోసం కృషి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసి ప్రతీ గ్రామ పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. పంట పెట్టుబడిని అందిస్తున్నారు. సన్న,చిన్నకారు రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే.. అలాంటి కుటుంబాలకు రైతుబీమా ఇస్తున్నారు. – వంగల వెంకట్ రెడ్డి ( సిర్సపల్లి గ్రామం )