భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ నాల్గో దశలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఎస్సీలకు దళితబంధు ఇస్తామని ప్రకటించారు.
రాబోయే 15 రోజుల్లో ఇంకో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని, దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలన్నారు. దళితబంధు ఇస్తామనగానే కిరికిరిగాళ్లు కొండి పెడుతున్నారని దుయ్యబట్టారు.
పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయన కేసీఆర్ ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలున్నాయని తెలిపారు. హుజురాబాద్‌లో వచ్చేనెల, రెండు నెలల్లో అందరికీ దళితబంధు వస్తుందని చెప్పారు. మిషన్ భగీరథపై విపక్షాలు వెకిలి మాటలు మాట్లాడాయని, ఏ పథకం ప్రవేశపెడతామన్నా విపక్షాలవి అపోహలు, అనుమానాలేనని కేసీఆర్ తప్పుబట్టారు.