హుజూరాబాద్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దళిత వాడలు మెరిసిపోతున్నాయి. ఆడపడుచులు మురిసిపోతున్నారు. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో హుజూరాబాద్‌లోని దళిత కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఇంటిని సుందరంగా అలంకరించుకున్నారు. తమ నివాసాల ముందు రంగవల్లులు వేసి.. దళిత బంధు అని చక్కగా రంగులు వేశారు. జై కేసీఆర్.. జై తెలంగాణ.. అనే పదాలు రాసి.. గులాబీ పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
అలా దళిత వాడలు రంగవల్లులతో మెరిసిపోతున్నాయి. ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కట్టి సంబురాలు జరుపుకుంటున్నారు. కొన్ని కాలనీలను అద్భుతమైన డెకరేషన్ చేసి దళిత బంధుకు స్వాగతం పలుకుతున్నారు. కేసీఆరే మా దేవుడు అంటూ కొలుస్తున్నారు.