తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.
ఈ వేదికపై దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి.. 15 మంది లబ్దిదారులకు చెక్కులను అందించనున్నారు. ఈ పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేలకు పైగా దళిత కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.