Home / SLIDER / మన అడుగుతో అన్ని రాష్ట్రాల్లో అగ్గి రాజుకుంటుంది: సీఎం కేసీఆర్

మన అడుగుతో అన్ని రాష్ట్రాల్లో అగ్గి రాజుకుంటుంది: సీఎం కేసీఆర్

హుజూరాబాద్‌లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘ఇది ఒక సువ‌ర్ణ అవ‌కాశం. మన నిర్ణయంతో భార‌త ద‌ళిత జాతి మేల్కొంటుంది. ఉద్య‌మ స్ఫూర్తి వ‌స్తుంది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి ర‌గులుకుంటుంది. పిడికెలిత్తి అడుగుత‌ది. ద‌ళిత బిడ్డ‌ల‌కు లాభం జ‌రుగుత‌ది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ఉద్య‌మానికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. మీరు చాలా బాధ్య‌త‌గా హుజూరాబాద్‌లో విజ‌య‌వంతం చేసి చూపి పెట్టాలె. ఈ ప‌థ‌కం అమ‌లులో అనుమానాలు అవ‌స‌రం లేదు. అంద‌రికీ, ప్ర‌తి కుటుంబానికి వ‌స్త‌ది. తెలంగాణ ఉద్య‌మంలో పెద్ద పెద్ద రాకాసుల‌తో పోరాటం చేశాను. పెట్టుబ‌డిదారుల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశాను. మీలో చాలా మంది పాత్ర‌ధారులే. ల‌క్షా 70 వేల కోట్లు అయిత‌ది స‌మ‌స్య‌నే కాదు. కానే కాదు. గ‌వ‌ర్న‌మెంట్ ప‌ట్టుప‌ట్టిన త‌ర్వాత వంద శాతం విజ‌యం సాధిస్తాం.’ అని కేసీఆర్ అన్నారు.r‘17 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఇచ్చిన ఒక లక్ష్యం రూ.70 వేల కోట్లు. సంవ‌త్స‌రానికి 30 వేల 40 వేల కోట్లు ఖ‌ర్చుపెడితే మూడేండ్ల‌లో ద‌ళిత వాడ‌ల‌న్నీ బంగారు మేడ‌ల‌వుతాయి. ద‌ళిత వాడ‌ల‌న్నీ బంగారు మేడ‌ల‌వుతాయ‌న్న గోరెటి వెంక‌న్న క‌ల నెర‌వేరాలి. ల‌డాయి గాళ్ల తోటి ఏ ప‌ని కాదు. కిరికిరి గాళ్ల మాట‌లు న‌మ్మి మోస‌పోవ‌ద్దు. 20 రోజుల త‌ర్వాత నేనే హుజూరాబాద్ వ‌చ్చి కొన్ని మండ‌లాలు తిరుగుతాను.’ అని సీఎం చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat