దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 37,927 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 493 మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,92,576కు పెరిగింది. ఇందులో 3,13,76,015 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,85,336 యాక్టివ్ కేసులున్నాయి.
మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,31,225 మంది ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 54,38,46,290 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.