సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకుంటారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
కాగా, పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఇప్పటికే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. కోట పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళారూపాలను ప్రదర్శించనున్నారు.