హుజురాబాద్ నియోజకవర్గంలో ని అర్హులైన ప్రతి దళిత కుటంబానికి దళిత బంధు పథకం వర్తింప చేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల తో టేలికాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం నియోజకవర్గంలో ని 20 వేల కుటుంబాల కు పైగా దళితులకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం, క్యాబినేట్ నిర్ణయం తీసుకుందన్నారు. శాలపల్లి లో 16 న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 14 మంది పేద దళితులకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఈ నెల 17 నుండి ఈ పథకం గ్రామంలో ని సర్పంచ్, ఎంపిటిసి, ఇతర ప్రజా ప్రతినిధుల తో పాటు గ్రామానికి ఒక అధికారిని నియమించి, అందరి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి లభ్డిదారుల ఎంపిక జరుగుతుందని, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా 20 వేల కుటుంబాలకు, సుమారు రూ. 2 వేల కోట్లు నిధులచే ఈ పథకం ద్వారా లభ్డిదారులకు ప్రోసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తెలికాన్ఫరెన్స్ లో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.