Home / MOVIES / నా వంటకు బలయ్యేది వారే!! 

నా వంటకు బలయ్యేది వారే!! 

మిల్కీబ్యూటీ తమన్నాను ఇప్పటి వరకూ కథానాయికగానే చూశాం. నిజ జీవితంలో ఆమె ఎలా ఉంటారు? ఏం ఇష్టపడతారు? ఎలా ప్రవర్తిస్తుంటారు. ఈ వివరాలేవీ పెద్దగా బయటకు తెలీదు. తెర వెనక తమన్నా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే త్వరలో ప్రసారమయ్యే కుకింగ్‌ షో చూడాల్సిందే అంటున్నారు. దీని గురించి ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

సినిమాల్లో నటించడం, డబ్బింగ్‌ చెప్పడం వేరు. ఓ ప్రాంతీయ కుకింగ్‌ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం వేరు. అందుకు భాష మీద పట్టు ఉండాలి. వంటకాల పట్ల ఆసక్తి ఉండాలి. ఈ విషయంలో నేను నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగానని నమ్మకంగా చెప్పగలను. నిజం చెప్పాలంటే ఈ రియాలిటీ షో ద్వారా నన్ను నేను మరింత తెలుసుకోగలిగాను. 

ఆహారానికి ప్రాధాన్యమిస్తా..

నాకు ఫుడ్‌ అంటే ప్రాణం. అలాగే ఆరోగ్యానికీ ప్రాధాన్యం ఇస్తాను. ఆహారం, ఆరోగ్యం ఈ రెండూ నా వ్యక్తిత్వంలో ముఖ్య భాగాలు. ఎప్పటికప్పుడు నేను తినే ఫుడ్‌ను ఎక్స్‌ఫ్లోర్‌ చేస్తూనే ఉంటా. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ  ప్రాంతీయ ‘థాలీ’ కోసం వెతుకుతూ ఉంటాను. మన భారతీయ సంస్కృతిలో అందరూ ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారు.  ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లలో భోజనంలో ఏం వడ్డించబోతున్నారు? రుచి బావుంటుందా? లేదా అనే కుతూహలం అందరిలోను ఉంటుంది. ఆహారం అంతలా మన జీవనశైలిలో భాగమైపోయింది. కాబట్టే కుకింగ్‌ షోలు కూడా రూపొందుతూ ఉన్నాయి. 

తెలుగింటి చేపల పులుసంటే ఇష్టం…

నాకిష్టమైన తెలుగు వంటకం చేపల పులుసు. బిర్యానీని ఇష్టంగా తింటా. నేను హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్లే ప్రతిసారీ నా స్నేహితుల కోసం బిర్యానీ తీసుకు వెళ్తా. వాళ్లకు అంతగా తెలుగింటి బిర్యానీ అంటే ఇష్టం. అలాగే స్వీట్లు అన్నా నాకు ప్రాణమే! పూతరేకులు నాకెంతో ఇష్టమైన స్వీట్‌. అయితే తినడం తప్ప ఏ వంటకాన్నీ వండే ప్రయత్నం చేయలేదు. ఇంట్లో వంట చేస్తానంటే అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే నా వంట మీద ఇంట్లో వాళ్లకు అంతగా నమ్మకం. ఈ కుకింగ్‌ షోను హోస్ట్‌ చేయటం వల్ల నాకు వంటలపై అవగాహన ఏర్పడింది. స్వయంగా వండగలననే నమ్మకం ఏర్పడింది. ఇకపై గరిట తిప్పాలనుకుంటున్నా. నా వంటకు మొదట బలయ్యేది నా కుటుంబసభ్యులే!

ఆ అభిమానం మరెక్కడా దక్కలేదు…

ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నన్ను తెలుగు నటిగానే గుర్తిస్తారు. నేను మాట్లాడినంత తెలుగు కొందరు తెలుగు అమ్మాయిలు కూడా మాట్లాడలేరేమో! తెలుగు ఇండస్ట్రీతో ఏర్పడిన ఇన్నేళ్ల అనుబంధంతో నాకు నేను తెలుగమ్మాయినే అనే భావనలోనే ఉంటాను. ఇక్కడి ప్రేమాభిమానాలు, ప్రోత్సాహం మరే ఇండస్ట్రీలోనూ నాకు దక్కలేదు. ఇది నాకు గర్వకారణం. తెలుగు ఇండస్ట్రీ నా టాలెంట్‌ని చూసిందే తప్ప, నేను ఎక్కడి నుంచి వచ్చాననేది పట్టించుకోలేదు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat