తెలంగాణలో జలాశయాలన్నీ నిండు కుండలా తొణికిసలాడతున్నాయి. గోదావరి నీళ్లతో సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు చుట్టూ పచ్చదనం పరుచుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఆ ప్రాంతం.
ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూను హరీశ్‌రావు తన కెమెరాలో బంధించి ట్వీట్ చేశారు.
రంగనాయక సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 2300 ఎకరాల్లో రూ.3300 కోట్ల వ్యయంతో రంగనాయకసాగర్ ప్రాజెక్టును నిర్మించారు.
సిద్దిపేట పట్టణానికి కేవలం 2 కి.మీ. దూరంలో ఈ ప్రాజెక్టును ఒక్క ఇళ్లు కూడా ముంపునకు గురి కాకుండా నిర్మించడం మరో విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్దదైన బాహుబలి మోటార్ ఇక్కడి పంప్ హౌస్‌లోనే ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 139.5 మెగావాట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద సామర్థ్యం ఉన్న మోటార్‌గా అభివర్ణిస్తున్నారు.