Home / SLIDER / సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్

సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్

బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా అడుగుతానని కొత్త స్టోరీ వినిపిస్తున్నారు. ఇదే రాజేందర్‌ కొన్నాళ్ల క్రితం ఏమన్నారో అందరికీ తెలుసు. ‘ఎకరం అమ్మితే ఒక ఎన్నిక గెలుస్తా’ అని గర్వంగా ప్రకటించుకున్నారు.

‘ప్రజా బలంతో కాకుండా, జనాభిమానంతో కాకుండా పైసలతో ఎన్నికలు గెలుస్తానని రాజేందర్‌ ఆనాడే చెప్పారు. డబ్బుల్లేకపోతే ఆ మాట ఎలా చెప్పగలడు? అసలు విషయం ఏమిటంటే.. లోపలున్న డబ్బును బయటకు తెచ్చేందుకే ఈ ఎత్తుగడ. ఇదో కొత్త నాటకం. రాజేందరే తన పైసలను నమ్మకస్తులు కొందరికి పంచుతాడు. మళ్లీ వాళ్లే తనకు చందాలిచ్చినట్టు షో చేస్తాడు. తద్వారా తానేదో కష్టాల్లో ఉన్నట్టు, జనమే తనకు ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రచారం పొందడం ఆయన పన్నాగం. ఇందులో భాగంగానే ఆయన ఇంటికో వెయ్యి చందా అడుగుతా అన్నాడు.

ఇదో ఎలక్షన్‌ జిమ్మిక్‌, చీప్‌ టాక్టిక్‌’ అని రాజేందర్‌కు దశాబ్దాలుగా సన్నిహితంగా మెదిలిన నాయకుడొకరు చెప్పారు. ఇదివరకటి ఎన్నికల్లో కూడా రాజేందర్‌ గంపగుత్తగా పైసలు పంచేవాడని, అందుకు తామే ప్రత్యక్ష సాక్షులమని, ఈసారి కూడా రాజేందర్‌ జనాన్ని కాకుండా పైసలను నమ్ముకున్నాడని మరో నాయకుడు అన్నారు. తను దాచుకున్న కోట్ల రూపాయల డబ్బుని బయటకు తెచ్చే ప్రయత్నాల్లో భాగమే ఈ చందాల దందా అని ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకంతో తన ఓటమి ఖాయమని తేలడంతో రాజేందర్‌ ఈ సానుభూతి నాటకం మొదలుపెట్టినట్టు కూడా ఆయన వివరించారు. మొత్తానికి దళిత బంధు పథకం అటు విపక్షాల్లోనూ, ఇటు రాజేందర్‌కూ జడుపు జ్వరం పుట్టించింది. అందువల్లే ప్రేలాపనలు మొదలయ్యాయని పరిశీలకులు అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat