అద్భుతమైన సంక్షేమ పథకాల ఆవిష్కరణ, అమలులోనే కాదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
‘స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో లక్ష మంది వీధివ్యాపారులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన రాష్ట్రంగా ఖ్యాతి గడించింది.
ఈ విషయాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ట్విట్టర్‌లో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 2.6 లక్షల మంది లబ్ధిదారులను లింక్‌చేసి వారికి అవసరమైన బీమా, పింఛన్, ఆహార భద్రత కల్పించామని వెల్లడించారు. వీధివ్యాపారుల జీవితాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నదని పేర్కొన్నారు.