ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసిన నటించిన ప్రియమణి ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో మెరుస్తుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లో సుచిత్ర పాత్రతో ప్యాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ఇద్దరు పిల్లల తల్లీగా నటించినా కూడా ప్రియమణి గ్లామరస్‌గానే కనిపించారు. నారప్ప చిత్రంలో డీ గ్లామర్ రోల్ పోషించిన ఈ ముద్దుగుమ్మ ఎంతగానో అలరించింది. ఇక విరాట పర్వం చిత్రంలోను కీలక పాత్ర పోషించింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతుంది ప్రియమణి. ఒకవైపు సినిమాలు,మరో వైపు టీవీ షోస్‌తో తెగ బిజీగా మారిన ప్రియమణి సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంది. తాజాగా సంప్రదాయ దుస్తులలో కనిపించింది. కోటలో రాజహంసలాగా ప్రియమణి ఇచ్చిన పోజులు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ప్రియమణి కంటెంట్ ఉన్నవాళ్లలో కాన్ఫిడెంట్ ఉంటుందనే సందేశాన్ని ఇచ్చింది.