రాయపర్తి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకాలు లేవన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.