తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగ ఎంప్లాయీస్ యూనియన్స్, అధికారులతో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై సమావేశం నిర్వహించారు.జిల్లా, జోనల్ మరియు మల్టీ జోనల్ క్యాడర్‌లకు సిబ్బంది కేటాయింపును విజయవంతంగా పూర్తి చేయడానికి సహకారం అందించడంతో పాటు సలహాలు సూచనలు, అభిప్రాయాలను తెలుపాలని వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
పిఆర్‌సి అమలు, ఉద్యోగులతో స్నేహపూర్వక విధానాలను పాటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగుల సంఘాలు వివిధ క్యాడర్‌లకు అధికారుల కేటాయింపు గురించి తమ అభిప్రాయాలను తెలియజేసాయి.
ఇతర సహచరులు మరియు యూనిట్‌లను సంప్రదించిన తర్వాత ఈ నెల 12న తగు సూచనలతో తిరిగి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.ఈ సమావేశంలో జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, జీఏడీ ఓఎస్డి అప్పారావు, ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి రవి, హోం శాఖ ఎస్ ఓ వనజ, సీఎం ఓఎస్డి కృష్ణ మూర్తి, టీజీవో ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మమత టీఎన్జీవో అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్ హాజరయ్యారు.