జైలుకు వెల్లినోడు జైలు గురించి మాట్లాడి సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో మాట్లాడుతున్నాడంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
‘‘హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మేము తలుచుకుంటే ఇక్కడ ఎవ్వడు ఉండరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మాకంటే బలవంతుడు ఎవడుంటాడు? జనాన్ని చూసుకొని పిచ్చి కూతలు కూస్తే మేమేంటో చూపిస్తాం.
కొంతమంది దద్దమ్మలు దళిత బంధు మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఆదివాసీ గూడేలకు వెళ్లిన వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి’’ అని తలసాని హెచ్చరించారు.