ఇల్లంతకుంటలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బుధవారం జరిగింది. ఈ సభకు హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రసంగించారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు శ్రీనివాస్ యాదవ్ పాదాభివందనాలు తెలిపారు.
తనను గెలిపించాలని హరీశ్ రావుకు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు అవకాశం ఇచ్చారు. విద్యార్థి నేతగా ఉద్యమాల్లో పాల్గొన్నాను. దళిత, బహుజన విద్యార్థుల హక్కుల కోసం పోరాడాను.
పార్టీ కోసం తాను చేసిన సేవలు గుర్తించి సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చారు. తనను గెలిపిస్తే మీ పని మనిషిలా సేవ చేసుకుంటానని గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.