హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్‌తో కలిసి కేసీ క్యాంప్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై తెలంగాణ నినాదాలతో హుజూరాబాద్ దద్దరిల్లింది.
