రైతుబీమా పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,450 కోట్లను విడుదలచేసింది. మంగళవారం వ్యవసాయంపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో 2021-22 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెక్కును మంత్రులు ఎల్‌ఐసీ ప్రతినిధులకు అందజేశారు.
రైతులపై ఆర్థికభా రం పడొద్దనే ఉద్దేశంతో మూడేండ్లుగా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. రైతులు.. ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేలా చూస్తున్నది. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.