తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మి/షాదీముభారక్ 86 మంది లబ్ధిదారులకు చెక్ లు అందజేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు…ఎమ్మెల్యే భగత్ గారు మాట్లాడుతూ పేదవారి యింట్లో జరిగే పెండ్లికి ప్రభుత్వం అందిస్తున్న తాంబూలమే కళ్యాణలక్ష్మీ/షాదీముభారక్ లని పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.
గతంలో నిరుపేదలు పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. ఆ కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు కుటుంభ పెద్దలా ఆలోచించి కల్యాణలక్ష్మీ వంటి పథకాలను తీసుకువచ్చారన్నారు. కల్యాణ లక్ష్మీ ..షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయన్నారు.
కరోనా కష్ట కాలం లో ప్రభుత్వ ఆదాయం పడిపోయినాతెలంగాణా ఇంటి ఆడపడుచులు ఇబ్బంది పడకూడదని మేనమామ రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తున్న వరంయిది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పిటిసి గాలి రవి, మండల పార్టీ అధ్యక్షుడు గజ్జల చెన్నారెడ్డి,మాజీ ఎంపీపీ బొజ్జయ్య, MRO, స్థానిక సర్పంచ్ సలహాదారుడు సయ్యద్ మియా,మండల ఉపాధ్యక్షుడు వెలుగు రవి,స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు,తదితరులు పాల్గొన్నారు…