సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. నేడు (ఆగస్ట్ 9) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులతో పాటూ యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా వచ్చిన బర్త్ డే బ్లాస్టర్ “ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్ అనే డైలాగ్‌తో మహేష్ ఎంట్రీ అదిరిపోయింది. ‘ఇఫ్ యు మిస్ ద ఇంట్రెస్ట్ యూ విల్ గెట్ ద డేట్’ అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో మహేష్ ఏ రేంజ్‌లో కనిపించబోతున్నాడో హింట్ ఇచ్చారు. భారీ యాక్షన్స్‌తో పాటు.. ‘సార్ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మర్చిపోకండి’.. అని క్యూట్‌గా కీర్తి సురేశ్ చెప్పిన డైలాగ్‌తో మంచి కామెడి అండ్ రొమాంటిక్ సీన్స్ ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
మొత్తంగా “సర్కారు వారి పాట” బ్లాస్టర్‌తో మరో భారీ హిట్ మహేశ్ ఖాతాలో పడబోతుందని తెలుస్తోంది. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి సెన్షేషన్‌ను క్రియేట్ చేస్తోంది. మహేహ్ కెరీర్‌లో 27వ సినిమాగా పరశురామ్ ఈ సినిమాను బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. జనవరి 13, 2022న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.