తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేశవరావు సేవలు అందించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.