తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సందర్భాలలో వారిద్దరు స్నేహ భావంతో మెలగడం మనం చూశాం.
తాజాగా కేటీఆర్.. మహేష్‌కి విషెస్ తెలియజేస్తూ, నాకు తెలిసిన నైసెస్ట్ సూపర్ స్టార్, ఎప్పటికి యువకుడిగా కనిపించే మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి బ్రదర్ అని తన కామెంట్‌లో రాసారు. ఈ ట్వీట్ నెటిజన్స్‌ని ఎంతగానో అలరిస్తుంది.